త్వరలోనే 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు: హరీశ్‌రావు

-

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో మరో 80వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ చేపట్టామని తెలిపారు. 1,331 మంది ఆయుష్‌ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించామని వెల్లడించారు. రాష్ట్ర వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరగుతున్నాయని అన్నారు. కొత్తగా ఎంపికైన 1061 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు హరీశ్‌ నియామకపత్రాలు అందజేశారు.

‘‘తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్యశాఖలో ఉద్యోగాలిచ్చాం. మరో 9,222 పోస్ట్‌లకు రెండు నెలల్లో నోటిఫికేషన్‌ ఇస్తాం. రోగుల ఆరోగ్యాన్నీ నయం చేయగల శక్తి వైద్యులకు ఉంటుంది. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలి. వచ్చే నెల నుంచి టి డియాగ్నస్టిక్స్‌లో 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతి లక్ష మందికి 22 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది’’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news