పాదయాత్రకు పిలిస్తే వెళతా – జగ్గారెడ్డి

-

పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలపై తనదైన శైలిలో స్పందించారు. సీఎల్పీ లో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్పి స్టార్ట్ కూడా చేశారని తెలిపారు. అసెంబ్లీ తర్వాత ఎవరి నియోజకవర్గాలలో వారు పాదయాత్ర చేస్తారని అన్నారు.

తనని ఎవరైనా పాదయాత్రకు పిలిస్తే పాల్గొంటారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తన జీవితం ముత్యాలముగ్గు సినిమాలోని హీరోయిన్ బతుకే అంటూ వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి. ప్రగతి భవన్ లో కూల్ చేస్తామని రేవంత్ రెడ్డి అనడం తప్పేనని చెప్పారు. కూల్చివేతలు కాంగ్రెస్ విధానం కాదని తెలిపారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని, సోనియా గాంధీ నాయకత్వంలోని వైఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news