కేంద్ర మంత్రి బండి సంజయ్ కి జగ్గారెడ్డి కౌంటర్..!

-

ఇందిరమ్మ పేరు చెబితే ఎందరో అభిమానిస్తారు. ఇందిరమ్మలా బీజేపీకి త్యాగ చరిత్ర ఉందని ఒక్కరైనా చెప్పగలరా..? నిన్న  బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదని నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇందిరాగాంధీ ఎక్కడికి వెళ్లినా రోటి, కడప, మకాన్ గురించే మాట్లాడేవారు.  

పేదలకు ప్రభుత్వ ఇళ్లు అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని కొనియాడారు జగ్గారెడ్డి. కేవలం ఇల్లు మాత్రమే కాదు.. ఇంటి స్థలం కూడా ఇందిరమ్మ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని మన ఊళ్లల పెద్ద వాళ్ల నెవ్వరినీ అడిగినా చెబుతారని, అంతగా ఇందిరమ్మ ఇళ్లు ప్రజల మనస్సుల్లో నాటుకుపోయాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు వారి ఉనికి కాపాడుకునేందుకు విమర్శలు చేయడం మామూలేనని వాటిని తమ పార్టీ గానీ, తమ నాయకులు పట్టించుకోరని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news