ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి కేంద్రం చర్యలు

-

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును తమ అధీనంలో ఉంచాలని నిర్ణయించింది. మరోవైపు ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఇవాళ దిల్లీలో జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో అత్యవసర సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీ సీఎస్‌లు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ డీజీలు, ఆన్‌లైన్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం అధికారులు, కేఆర్ఎంబీ అధికారులు నేరుగా హాజరయ్యారు.

సాగర్ వద్ద పరిస్థితి కొలిక్కి తేవడంపై అధికారులు చర్చిస్తున్నారు. సాగర్, శ్రీశైలం, అనుబంధ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై చర్చ జరుగుతోంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించే ప్రక్రియ కేంద్ర జల శక్తి శాఖ ప్రారంభించనున్నట్లు సమాచారం. సాగర్ డ్యామ్‌ వద్ద జరిగిన పరిణామాలను తీవ్రంగా తీసుకున్న కేంద్రం.. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రత పరిధిలోకి రెండు జలాశయాలను తీసుకురావాలని యోచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news