Telangana : రేపు ఉదయం 10 గంటలకే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం రిలీజ్ కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం డిసెంబర్ మూడో తేదీన జరగనుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వికాస్ రాజు తెలిపారు.
అయితే.. కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి ట్రబుల్ షూటర్ అయిన డీకే శివకుమార్ ని కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపుతోంది. నేడు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. రేపు ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థుల వెంట ఏఐసిసి పరిశీలకులు ఉంటారు. వారి తమ అభ్యర్థులను ఇతర పార్టీలు ఆకర్షించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
ఫలితాల్లో మ్యాజిక్ మార్క్ రాకపోతే…. ఆ అభ్యర్థులంతా…. తాజ్ కృష్ణలో జరిగే మీటింగ్ కి రావాల్సి ఉంటుంది. ఈ మీటింగ్ లో నెక్స్ట్ ఏం చేద్దాం అనేది డిసైడ్ చేస్తారు. అదే మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తే….ఇక క్యాంప్ రాజకీయాల సమస్య ఉండదు. కాంగ్రెస్ అధిష్టానం…. డీకేని రంగంలోకి దింపడానికి చాలా కారణాలు ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీకే కృషి కారణం. ఆయనే కాంగ్రెస్ రెబెల్స్ అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి… అధికారం దక్కేలా చేశారు. అందుకే కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి ట్రబుల్ షూటర్ అయిన డీకే శివకుమార్ ని కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపుతోంది.