తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కొందరి వారసుల ఎంట్రీకి రంగం సిద్ధమైంది.పెద్ద స్థాయిలో వారసుల ఎంట్రీ లేదు..కానీ కొందరు కీలక నేతల వారసులు మాత్రం పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో అతి పెద్ద సీనియర్ జానారెడ్డి ఇద్దరు వారసులు ఎంట్రీ ఇచ్చారు..మొదట జనతా పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి…తొలిసారి ఎన్నికల బరిలో ఓడిపోయి..నెక్స్ట్ టిడిపిలోకి వచ్చి వరుసగా రెండుసార్లు గెలిచి..నెక్స్ట్ కాంగ్రెస్ లోకి వెళ్ళి అక్కడ నుంచి తిరుగులేని నేతగా ఎదిగిన జానారెడ్డి ఇంకా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు.
మంత్రి పదవితో పాటు అనేక కీలక పదవులు చేపట్టిన ఆయన..సిఎం రేసులో కూడా నిలిచారు. కానీ పదవి దక్కలేదు. ఇక గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు..మళ్ళీ ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈ సారి మాత్రం జానారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో దాదాపు ఆయన రాజకీయాల నుంచి సైడ్ అయ్యారని చెప్పవచ్చు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్ధులు ఫీజులు కట్టి గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జానారెడ్డి దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఆయన ఇంకా పోటీ నుంచి తప్పుకున్నారని తేలిపోయింది. ఇదే సమయంలో ఆయన ఇద్దరు కుమారులు దరఖాస్తులు పెట్టుకున్నారు. జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి..మిర్యాలగూడ సీటు కోసం, చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నుంచి దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో జైవీర్‌కు సీటు పక్కా..అటు రఘువీర్‌కు సీటు ఖాయమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఇద్దరు బరిలో దిగే అవకాశం ఉంది. ఇక గెలుపు అవకాశాలు ఇద్దరిలో జైవీర్‌కు కాస్త ఎక్కువ ఉన్నాయి. అయితే ఇద్దరు బిఆర్‌ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురుకోవాలి. మరి ఇద్దరిలో ఎవరు తొలి విజయం అందుకుంటారో చూడాలి.