ప్లీజ్ కనీసం నన్నైనా నమ్మండి.. అమెరికా పెట్టుబడులు నిజమే!

-

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా టూర్‌ పై కీలక ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర ఐటి & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. అమెరికాకు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఎంజాయ్‌ చేస్తున్నాడు కానీ.. కంపెనీలు తీసుకురావడం లేదని.. తన తమ్ముడి కంపెనీని తీసుకొస్తున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపణలు చేసింది. అయితే.. దీనిపై ఐటి & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్.. క్లారిటీ ఇచ్చారు.

Jayesh Ranjan, Principal Secretary, Department of IT & Industries

ప్లీజ్ కనీసం నన్నైనా నమ్మండి.. ఈ పెట్టుబడులు నిజమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఐటి & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. రేవంత్ రెడ్డి అమెరికాలో చేస్తున్న మీటింగుల విశ్వసనీయత మీద తెలంగాణ ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అన్ని విషయాలు చెక్ చేసాకనే మీటింగులు చేస్తున్నామని వివరణ ఇచ్చారు ఐటి & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. మొన్న, నిన్న చేసిన కొన్ని పెట్టుబడుల ప్రకటనలు బోగస్ అని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో జయేశ్ రంజన్ ఈ వివరణ వీడియో జారీ చేశారు. గత పదేళ్ళలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఇటువంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version