నిజామాబాద్‌లో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కడమే – జీవన్‌ రెడ్డి

-

నిజామాబాద్‌లో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కడమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్‌ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ….నిజామాబాదు పార్లమెంట్ స్థానం లో కాంగ్రెస్ ని నిల్వరించడానికె బీజేపీ, BRS పార్టీలు కుట్ర పన్నాయని ఆరోపణలు చేశారు. నిజామాబాదులో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కడమేనని.. గెలిస్తే అర్జునుడిని ఓడితే అభిమాన్యుడిని అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

jeevan reddy about nizamabad

గెలిచినా… ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలు నాకు…. రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల అని వెల్లడించారు. బీజేపీ పార్టీ సిద్ధాంతం, ఆర్థికప్రణాళిక లేని పార్టీ….బీజేపీ ఫలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమల్యయే ఏ ఒక్క పథకం అయిన అమలవుతుందా ? అని ప్రశ్నించారు.
BRS పార్టీ నాయకులు రైతు దీక్షల పేరిట ధర్నాలు చేయడం దేయ్యలు వేదాలు వాళ్ళించినట్టు ఉందని ఫైర్ అయ్యారు. నాకు పదవులు ఇవ్వడం లేదంటూ…రేవంత్‌ పై జీవన్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. నా హోదా కు తగ్గా పదవి ఇచ్చే పరిస్థితుల్లో లేరు, నా రాజకీయ జీవితంలో నా హోదాకు చిన్న పదవి నేను తీసుకోను అని చెప్పారు. కొట్లాడాలి నా జీవితంలో చివరి యుద్దం చేశానని వెల్లడించారు జీవన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news