జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన నిందితులు మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. కార్పొరేటర్ కుమారుడే బాలికను ట్రాప్ చేశాడని చెప్పిన నిందితులు. పబ్బులో బాలిక పట్ల మొదట కార్పొరేటర్ కుమారుడే అనుచితంగా వ్యవహరించాడని చెప్పారు.పబ్ బయట కార్పొరేటర్ కుమారుడే అమ్మాయికి మాయమాటలు చెప్పి.. బాలికను కారులో ఎక్కించారని వెల్లడించారు.
బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే కుమారుడే బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పిన నిందితులు. ఎమ్మెల్యే కుమారుడి తర్వాత కార్పొరేటర్ కొడుకు బాలిక పట్ల అసభ్యంగా వ్యవహరించాడని అన్నారు. కాన్సూ బేకరి దగ్గరికి వెళ్ళేసరికి ముందు సీట్లో ఉన్న సాధుద్దిన్ వెనుక సీట్లో కి మారాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. మొదట సాధుద్దీన్ బాలికపై లైంగిక దాడి చేశాడని వెల్లడించారు. కాన్సూ బేకరీ దగ్గర బాలికను కార్లోనే కూర్చోబెట్టి బేకరీ లో అందరూ ఫుడ్, సిగరెట్లు తాగామని తెలియజేశారు.
అందరం కలిసి ఇన్నోవా కారులోనే పబ్ కి బయల్దేరాము అన్న నిందితులు.. బాలిక సెల్ ఫోన్, కళ్లద్దాలను బలవంతంగా లాక్కున్నామని, అవి కావాలంటే ఇన్నోవా లో ఎక్కాలని బెదిరించామని తెలిపారు. ఇన్నోవా లోకి ఎక్కిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడి చేశామని అంగీకరించారు.