తెలంగాణ హైకోర్టులో భారీగా న్యాయమూర్తుల సంఖ్య పెంపు

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య భారీగా పెరగనుంది. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతం వరకు పెంచుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నిర్ణయం తీసుకున్నారు. కాగా తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు రెండేళ్లుగా అనేక విజ్ఞప్తులు అందాయి. అయితే వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పరిశీలిస్తూ వస్తున్నారు.

 

ఇందులో భాగంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో రెండు రోజుల పాటు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ అయిన సీజేఐ ఎన్వీ రమణ … న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలంటూ తెలంగాణ హైకోర్టు నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతానికి పెంచారు. సీజేఐ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు చేరనుంది. కాగా హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీజేఐ కార్యాలయం వెల్లడించింది.