నేను సీఎం అయితే పెన్షన్స్, రైతుబంధు డబుల్ చేస్తా – కేఏ పాల్‌

-

నేను సీఎం అయితే పెన్షన్స్, రైతుబంధు డబుల్ చేస్తానని సంచలన ప్రకటన చేశాడు కేఏ పాల్‌. న్యాయస్థానాలను తెలంగాణ ప్రభుత్వం మేనేజ్ చేస్తుందని.. కామారెడ్డి రైతుల పిటిషన్ ఈరోజు విచారణ ఉన్నా కూడా లిస్ట్ కాకుండా అడ్డుపడుతున్నారని ఫైర్‌ అయ్యారు కేఏ పాల్‌. కామారెడ్డి రైతుల పక్షాన నేను పార్టీ ఇన్ పర్సన్ గా పిటిషన్ వేశానని.. ధరణి పోర్టల్ పై పిల్ వేస్తానని వెల్లడించారు.

ధరణిలో అనేక అక్రమాలు జరిగాయని.. నాకు త్రెట్ ఉందని హైకోర్టులో పిటిషన్ వేశానని వివరించారు.
అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు సెక్యూరిటీ కల్పించడం లేదని.. నేను సీఎం అయితే పెన్షన్స్, రైతుబంధు డబుల్ చేస్తానని ప్రకటించారు. నిన్న ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాప్ అయిందని.. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదన్నారు. BRS, BJP రెండూ ఒక్కటేనన్నారు కేఏ పాల్‌.

Read more RELATED
Recommended to you

Latest news