BREAKING : ప్రజా శాంతి పార్టీ నుంచి గద్దర్ ను సస్పెండ్ చేసిన కెఏ పాల్

-

BREAKING : ప్రజా శాంతి పార్టీ నుంచి గద్దర్ ను సస్పెండ్ చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు ka పాల్. ప్రజా శాంతి పార్టీ నుండి ప్రజాయుద్ద నౌక గద్దర్ ను సస్పెండ్ చేసిన పార్టీ అధ్యక్షుడు ka పాల్… ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు ka పాల్… మాట్లాడుతూ… మునుగోడులో ప్రచారం చేస్తానని చెప్పి మన పార్టీలో జాయిన్ అయ్యారు..కానీ రేవంత్ పిలవడంతో మళ్ళీ కాంగ్రెస్ వైపు గద్దర్ వెళ్ళారని తెలిపారు. శ్రీకాంతచారి తండ్రి వెంకటచారి కూడా ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయితే ఆయనను పార్టీలో ఉండనివ్వకుండా చేశారని ఆగ్రహించారు. ప్రజాశాంతి పార్టీలో సామాన్య ప్రజలు జాయిన్ అవుతుంటే ఓర్చుకోలేక పోతున్నారని ఫైర్‌ అయ్యారు కేఏ పాల్‌.

Read more RELATED
Recommended to you

Latest news