పదో తరగతి విద్యార్థిని గర్భవతి చేసిన కామాంధుడు..!

-

ప్రస్తుతం కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. పక్కింటి వారిని లేక వరుస అయ్యే వారిని.. కొంత మంది అయితే వావి వరుసలు కూడా మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పదో తరగతి  విద్యార్థినిపై ఓ కామాంధుడు కన్నేసి గర్భవతిని చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్లలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే..   చెవెళ్లకు చెందిన కోజ్జంకి సుదర్శన్ అనే వ్యక్తికి విహాహమై ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే పాఠశాలకు వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని వెంట నిత్యం వెంటబడుతూ.. ఆమెను లోబరచుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. దీంతో ఎక్కడ పరువుపోతుందోనని గ్రహించిన విద్యార్థిని తండ్రి గాంధీ ఆసుపత్రిలో అబార్షన్ చేయించడంతో ప్రస్తుతం ఆ బాలిక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థిని తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కొజ్జంకి సుదర్శన్ పై పోలీసులు ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరుడు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news