దేశంలో నే కరీంనగర్ మొదటి కంటైన్‌మెంట్‌ జోన్: సీఎం కేసీఆర్

-

ప్రగతి భవన్ లో తెలంగాణా కేబినేట్ సమావేశం ముగిసింది. అనంతర౦ సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ పొడిగింపు, మద్యం అమ్మకాల మీద కేబినేట్ లో చర్చ జరిపారు. ఈ నెల 28 వరకు లాక్ డౌన్ ని పొడిగించే అంశంపై కేబినేట్ చర్చించింది. 7 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఇక ప్రజలకు ఇవ్వాల్సిన ఆర్ధిక సహాయం మీద కూడా కేబినేట్ లో చర్చించారు.

తెలంగాణాలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ ని పొడిగించే అంశంలో కేసీఆర్ మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు సర్వేలను కూడా మంత్రి వర్గంలో చర్చించారు. ప్రజా అభిప్రాయం మీద చర్చ జరిగింది. ఎవరు ఆకలితో ఉండకూడదు అని భావిస్తున్న సిఎం… దీనిపై చర్చించారు. ప్రధానంగా నాలుగు జిల్లాల మీద మంత్రి వర్గంలో చర్చించారు కేసీఆర్.

కేబినేట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్… తెలంగాణాలో నేడు కొత్తగా 11 మందికి కరోనా సోకింది అని వివరించారు ఇప్పటి వరకు రాష్ట్రంలో 1096 మందికి కరోనా సోకింది అని చెప్పారు. కరీంనగర్ లో కరోనా కట్టడి విషయంలో చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నామని, దేశంలో మొదటి కంటైన్మేంట్ జోన్ కరీంనగర్ అని, దేశంలో అప్పటి వరకు ఆ పధం కూడా తెలియదు అని ఆయన పేర్కొన్నారు.

కరీంనగర్ లో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడామని ఆయన చెప్పుకొచ్చారు. కరోనాను కట్టడి చేయడంలో వందకు వంద శాతం సక్సెస్ అయ్యామని అన్నారు.తెలంగాణాలో కరోనా ఇప్పుడు పూర్తిగా తగ్గుముఖం పట్టింది అని 628 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేట్ 27 శాతం ఉంటే తెలంగాణాలో 37 శాతం ఉందని ఆయన వివరించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా మరణాల శాతం 3.37 శాతం ఉంటే తెలంగాణాలో 2.24 శాతం మాత్రమే ఉందని అన్నారు. మనదేశం లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు భయంకరంగా చనిపోతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వైద్యుల కోసం ప్రత్యేక మాస్క్ లు తెప్పిస్తున్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news