సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు కౌశిక్ రెడ్డి.  మాదాపూర్ లో FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పెదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు. మరీ తిరుపతి రెడ్డి ఇంటికీ నోటీసులు ఎందుకు  ఇచ్చారని ప్రశ్నించారు.

సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టడం లేదో సమాధానం చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి SLR విల్లాస్ లో శివానంద్ ను బెదిరించి తిరుపతి రెడ్డికీ విల్లా ఇప్పించాడని పేర్కొన్నారు. ఒకవేళ తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టినా ఏమి అనుకోవద్దు అని ఈ ప్లాట్ ఇప్పించాడని తెలిపారు. ఇది వాస్తవం కాదా..? దీని గురించి తిరుపతిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తన  ఇంటి మీద దాడి చేయించిన పోలీసులకు కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దగ్గరుండి నా మీద దాడి చేయించిన ఏసీపీని, సీఐని నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ  బీఆర్ఎస్ అధికారంలోకి  వచ్చిన తర్వాత మిమల్ని ఎట్టి పరిస్థితితో వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news