మేనల్లుడి వ్యాపారాల గురించి కవిత చెప్పడం లేదు.. ఈడీ తరపు లాయర్ కీలక వ్యాఖ్యలు

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తొలుత ఈడీ ఈనెల 17 నుంచి 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుంది. ఇవాళ కవిత ఈడీ కస్టడీ ముగిసిపోవడంతో రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను ప్రవేశ పెట్టారు. కవిత ఈడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ వాదించింది. తన క్లయింట్ కి బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్ కోరారు. చివరికీ 3 రోజులు కస్టడీకి ఇస్తూ జడ్జ్ తీర్పు ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. ఈడీ తరపు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు.  ముఖ్యంగా సోదాల సమయంలోనే కవిత ఫోన్ ను సీజ్ చేశామని చెప్పారు. మొబైల్ లో కొంత డేటా సమాచారం డిలీట్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. కవిత ఫోన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించామన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో సరిపోల్చి చూసినట్లు వెల్లడించారు. అంతేకాదు.. కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు కూడా చెప్పాలని కోరామని.. కానీ, తనకు తెలియదని కవిత సమాధానం చెప్పినట్టు   ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కవిత మేనల్లుడి పాత్ర విషయంలో వాస్తవాలు తేల్చేందుకు హైదరాబాద్ లో ఈడీ సోదాలు జరుగుతున్నాయని ఈడీ తరపు న్యావాది వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news