కేసీఆర్ ఎఫెక్ట్…నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మొన్న సూర్యాపేట పర్యటనలో నాగార్జున సాగర్ డ్యాంలో 14 టీఎంసీల నీళ్లు ఉన్నా విడుదల చేయకుండా ఎందుకు పంటలు ఎండబెడుతున్నారు అని ప్రశ్నించారు కేసీఆర్. ఈ తరుణంలోనే తాజాగా నాగార్జున సాగర్ నుండి ఎడమ కాలువ ద్వారా నల్లగొండ జిల్లాకు 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు.
ఇదే విషయాన్ని తెలంగాణ సీఎస్ కూడా వివరించారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని అందించాలన్నారు. ఇప్పటికే, అన్ని గ్రామాలు, వార్డులలోని బోరుబావుల మరమ్మతులు, ఫ్లషింగ్ లను పూర్తి చేయడంతోపాటు పైప్ లైన్ల లీకేజీలను అరికట్టడం జరిగిందని తెలియచేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి పాలేరు జలాశయానికి తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేయడం జరిగిందని, ఈ జలాలు పాలేరు ప్రాజెక్టుకు చేరుకునేలా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.