రేపటి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ జరుగనుంది. ఈ మేరకు పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చని పలువురు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.
గ్రామ, వార్డు సెక్రటరీలతో పెన్షన్లు పంపిణీ చేసినా.. వారం రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని వెల్లడించారు పలువురు కలెక్టర్లు. రూరల్ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కుదురుతుంది కానీ.. అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కొంచెం కష్టతరమవుతుందన్నారు ఇంకొందరు కలెక్టర్లు. గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని డిసైడ్ చేయాలంటే.. సచివాలయాల వద్ద టెంట్లు.. తాగు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు కలెక్టర్లు. దీంతో రేపటి నుంచి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ జరుగనుంది. ఈ నెల 8వ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ జరుగనుంది.