కేసీఆర్ అద్భుత పాలనతోనే రాష్ట్రానికి అవార్డులు – మంత్రి హరీష్ రావు

-

సీఎం కేసీఆర్ అద్భుత పాలనతోనే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. నేడు మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్లుగా జరగని అభివృద్ధిని కేసీఆర్ చేశారని అన్నారు. కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారాలను అభివృద్ధి చూపించి తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారాలపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అభివృద్ధిలో మిర్యాలగూడ నియోజకవర్గం పరుగులు పెడుతుందని అన్నారు. దానికోసం రూ. 4500 కోట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. అలాగే మిర్యాలగూడ ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న బోగస్ ప్రచారాన్ని బిఆర్ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని చెప్పడానికి కేంద్రం ఇచ్చిన అవార్డులే నిదర్శనం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news