కేసీఆర్‌కు మళ్ళీ తిరుగులేదు..బీసీలని తిప్పుకున్నట్లే.!

-

తెలంగాణ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ వ్యూహాలకు తిరుగులేదనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఆయన వ్యూహాలు సక్సెస్ అవుతున్నాయి. అలాగే బి‌ఆర్‌ఎస్ పార్టీకి వరుస విజయాలు దక్కుతున్నాయి. ఇక ఇదే క్రమంలో మళ్ళీ బి‌ఆర్ఎస్ పార్టీని గెలిపించి మూడోసారి కూడా అధికారంలోకి తీసుకురావాలని కే‌సి‌ఆర్ ట్రై చేస్తున్నారు. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి బి‌ఆర్‌ఎస్ కు అధికారం అక్కడం ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీతో గట్టి పోటీ ఎదురవుతుంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు కే‌సి‌ఆర్ ఎక్కడకక్కడ కొత్త వ్యూహాలతో వస్తున్నారు. తాజాగా ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని బి‌ఆర్‌ఎస్ ట్రై చేసింది. మొదట్లో ఈ విషయంలో బి‌ఆర్‌ఎస్ సక్సెస్ అయింది గాని..తర్వాత కాంగ్రెస్ కాస్త గట్టిగానే నిలబడి బి‌ఆర్‌ఎస్ వ్యూహాలని తిప్పికొట్టింది. అయినా సరే కే‌సి‌ఆర్ ఏదొక విధంగా బలమైన వ్యూహాలు పన్నుతూనే రాజకీయం నడిపిస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీల ఓట్లని ఆకర్షించడమే లక్ష్యంగా కే‌సి‌ఆర్ కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

brs party
brs party

బీసీ కుల వృత్తుల వారికి రూ. లక్ష సాయం చేయాలని డిసైడ్ అయ్యారు. నియోజకవర్గానికి మొదట 50 కుటుంబాలని ఎంచుకుని ఈ సాయం అందించాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే దళితబంధు పేరిట ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు బీసీ కుల వృత్తుల వారికి లక్ష సాయం చేయనున్నారు. ఈ సాయం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. దీంతో బీసీల ఓట్లు తమకు కలిసొస్తాయనేది కే‌సి‌ఆర్ ప్లాన్. ఈ సాయం కరెక్ట్ అందితే బీసీలు..బి‌ఆర్‌ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మళ్ళీ కే‌సి‌ఆర్ తిరుగులేకుండా గెలిచి సి‌ఎం అయ్యే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news