సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. శనివారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అబద్దాలకు ప్రతిరూపమని విమర్శించారు. పాత హామీలనే కొత్తగా చెబుతూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయం రాజ్యమేలుతుందని దుయ్యబట్టారు. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోనూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్ ను నాలుగు నెలల్లో, సచివాలయాన్ని ఎనిమిది నెలల్లో నిర్మించుకున్న కేసీఆర్.. పేద ప్రజలకు ఇళ్లు కట్టడానికి మాత్రం ఏళ్ల సమయం తీసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కు పేదల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఇళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని 2017 లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ఎలా వెళతారని ప్రశ్నించారు.