భర్తకోసం కేరీర్ వదిలేసుకున్న భార్యలను చూసి ఉంటారు. కానీ ఈమె ఇంచుమించు ప్రాణాలనే వదిలేసుకుంది. లావుగా ఉన్నావు, బుగ్గలు బాగా ఉన్నాయని భర్త అన్నాడని పూర్తిగా తినడం మానేసి అస్థిపంజరంలా మారింది. భార్య చచ్చిన శవంలా అవుతున్నా కనీసం పట్టించుకోని భర్త.. ఆ భర్త కోసం ఈమె ఎందుకు ఇలా అయింది..? ఈ స్టోరీ ఏంటో మీరు చూడండి..!
ప్రపంచంలో వివిధ రకాల వ్యక్తులు ఉంటారు. వారికి వారి స్వంత ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. అయితే, ఒక వ్యక్తి యొక్క శరీరంపై కమెంట్స్ చేయడం చాలా తప్పు.. వారి స్వంత ఎంపిక అని అర్థం చేసుకోవడం ముఖ్యం. దీని కోసం ఒత్తిడి చేయడం మంచిది కాదు. అయితే అలాంటి ఒత్తిడిలో ఓ మహిళ తనను తాను అస్థిపంజరంగా మార్చుకుంది. తన భర్త ఆనందం కోసం తనను తాను బాధితురాలిని చేసుకుంది. రష్యాలో(Russia) ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
దక్షిణ-పశ్చిమ రష్యాలో నివసిస్తున్న యానా బోబ్రోవా(Yana Bobrova) అనే మహిళ తన భర్త ఆనందం కోసం తనను తాను ఆకలితో బాధితురాలిని చేసుకుంది. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న యనా ప్రస్తుతం మనిషేనా.. అస్థిపంజరమా అన్నట్లు ఉంది. ఈ మహిళ యొక్క బరువు 4-5 సంవత్సరాల పిల్లలకు సమానంగా ఉంటుంది. బెల్‌గ్రేడ్ నివాసి యానా బొబ్రోవా 5.2 అడుగుల ఎత్తు ఉంటుంది..22 కిలోల బరువు మాత్రమే ఉంది. ఆమె ఎత్తు ప్రకారం, బరువు చాలా తక్కువగా ఉంటుంది. పూర్తిగా పేలవంగా కనిపిస్తుంది. ఉబ్బిన బుగ్గలున్నాయని భర్త కమెంట్ చేయడంతో ఆ మహిళ ఇలా చేసిందట.
భర్త తన బుగ్గలపై కామెంట్ చేశాడని, నెమ్మదిగా తన విశ్వాసాన్ని దెబ్బతీశాడని యానా స్థానిక మీడియాకు తెలిపింది. అయితే యూనివర్శిటీ రోజుల నుంచి బరువు తగ్గాలనే ఆమెకు కోరిక ఉండేదట. ఆమె చాలా వ్యాయామాలు చేసేది, డైట్‌ని ఫాలో అయ్యేది. తర్వాత భర్త కోరిక మేరకు బరువు తగ్గించుకుని క్రమంగా అస్థిపంజరంలా మారింది. భర్త కూడా ఆమెను అలా చేయడాన్ని ఎప్పుడూ ఆపకపోవడం గమనార్హం. ఆమె అంత వీక్‌గా ఉండేసరికి ఉద్యోగం నుంచి కూడా తీసేశారు. మీరు చూడండి ఆ ఫోటోలో ఉన్న మహిళను.. అసలు ఎందుకైనా పనికొస్తుందా..? ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రామాలమీదకు తెచ్చుకోవడం నిజంగా తెలివితక్కువ పనే అంటున్నారు నెటిజన్లు.!