KCR పేరు మార్చాలి – ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నేడు నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పేరుని మార్చాలని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఓ భగీరథ ప్రయత్నం అని.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్ పేరును ” కాలేశ్వరం చంద్రశేఖర రావు” గా మార్చాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం గురించి గర్వంగా చెప్పుకోవాలన్నారు కవిత. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరం అని చెప్పారు. స్వల్ప కాలంలో రాష్ట్ర గతినే మార్చే ప్రాజెక్టును నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని సమీక్ష చేయడం కోసమే తెలంగాణ దశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news