ఆయిల్ పామ్ రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. రూ. లక్ష సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధం అయింది సర్కార్. తెలంగాణ లో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు మంత్రి హరీష్ రావు. ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచనలు చేశారు. సిద్దిపేటలో రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.
ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ఎకరానికి రూ. లక్ష సబ్సిడీ ఇస్తోందని.. రైతులు సాగువైపు ఆలోచన చేయాలని కోరారు మంత్రి హరీష్ రావు. తల్లి బాగుంటే ఇళ్లు బాగుంటుంది. పిల్లలు బాగుంటే భావిభారతం బాగుంటుంది. అందుకే తల్లీ బిడ్డ సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పథకాలు ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు హరీష్ రావు.