అసెంబ్లీ సమావేశాల తర్వాత మేం కూడా మేడిగడ్డ పోతాం : కేసీఆర్

-

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టులో వందల కొద్ది పిల్లర్లు, 1500 కిలోమీటర్ల కాలువ, 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు ఉంటాయని తెలిపారు. అంత పెద్ద ప్రాజెక్టులో ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోతే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంతకు ముందు కడెం గేట్లు కొట్టుకుపోలేదా, నాగార్జున సాగర్ పిల్లర్లు కుంగిపోలేదా అని ప్రశ్నించారు.

“రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. ప్రాజెక్టులో ఏదైనా లోపం ఉంటే అది సరిదిద్దాలి. అంతే కానీ రాజకీయం చేయడం సరికాదు. ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధికి ముందుకు రావాలి. మేడిగడ్డలో ఏం జరిగిందని అందరు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మేం అందరం కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తాం. అక్కడ ఏం జరిగింది, ఆ బ్యారేజీ వల్ల ఎందరికి మేలు జరిగిందో మేం కూడా రాష్ట్ర ప్రజలకు వివరిస్తాం.” అని కేసీఆర్ అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news