తెలంగాణ ప్రజలకు కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అన్నారు.

KCR wishes the people of Telangana Holi

హోలీ పండుగ భారతీయ సామాజిక సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని కేసీఆర్ అన్నారు.
వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతీమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news