ధాన్య సేకరణ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

-

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతీ విషయంలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తుంది. త్వరలోనే ఆర్టీసీ అద్దె బస్సులను కూడా మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్.

ధాన్యం కొనుగోళ్ల పై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. ధాన్య సేకరణతో పాటు గోదాములు,   మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీలు, మిల్లింగ్ ఛార్జీలు వంటి అంశాలపై ఈ సబ్ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ప్రకారమే.. ధాన్య సేకరణ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news