జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి..!

-

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఊహించని షాక్‌ తగిలింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా బొరబండలో హైటెక్ హోటల్ సమీపంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు.

Jubilee Hills MLA Maganti Gopinath attacked with sandal

అదే సమయానికి బొరబండ స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడే ప్రచారం నిర్వహిస్తుండడంతో, రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక కార్పొరేటర్ కొంత మంది మహిళలను రెచ్చగొట్టడంతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై మహిళ చెప్పు విసిరి దాడి చేసినట్టు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news