శ్రీ చైతన్య కాలేజీకి ఎంపీ కోమటిరెడ్డి.. సాత్విక్ మృతిపై ఆరా..

-

ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ సూసైడ్ లెటర్ లో సంచలన విషయాలను వెల్లడించారు. కాలేజీ ప్రిన్సిపల్, ఇంచార్జ్ లెక్చరర్ తన మృతికి కారణమని, వారి టార్చర్ వల్లనే తాను సూసైడ్ చేసుకున్నట్లు సాత్విక్ తెలిపాడు.

అయితే సాత్విక్ సూసైడ్ నోట్లో పేర్కొన్న నలుగురిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేడు కోమటిరెడ్డి నార్సింగ్ లోని శ్రీ చైతన్య కాలేజీకి వెళ్లారు. సాత్విక్ మృతిపై కాలేజీ సిబ్బందిని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు కోమటిరెడ్డి. అయితే కాలేజీ లోపలికి వెళ్లేందుకు ఆయనని అనుమతించకపోవడంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

అనంతరం లోపలికి వెళ్లి విద్యార్థి మృతి పై ఆరా తీశారు ఎంపీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసేంతవరకు కాలేజీలోనే కూర్చుంటానని అన్నారు. నర్సింగి సీఐ చట్టం గురించి నాకే చెబుతున్నాడని, విద్యార్థి చావుకు కారణమైన వారిని అరెస్టు చేయమంటే నాకే చట్టం గురించి చెబుతున్నాడని మండిపడ్డారు. లక్షల రూపాయలు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసి ర్యాంకుల కోసం విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news