చనిపోయేంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటా – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి కూడా త్వరలో బిజెపిలో చేరుతారని ఈ మధ్య వార్తలు వినిపించాయి. టిపిసిసి నేతలు మాత్రం వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారని.. మునుగోడులో ప్రచారం చేస్తారని చెబుతూూ వస్తున్నారు. అయితే ఆయన పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై వెంకట్ రెడ్డి స్పందించారు. తాను చనిపోయేంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

komatireddy venkat reddy

” కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్… కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి” అన్నారు. తాను పార్టీ పదవిని మాత్రమే ఆశించానని.. మంత్రి, సీఎం పదవులు తనకి అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా ముందస్తుగా టికెట్లు ప్రకటించరని.. సర్వే చేసి ఆరు నెలల ముందే టికెట్లు ప్రకటించాలని అన్నారు. టిఆర్ఎస్ లో ఎవరు బయటకు వెళతారో? ఎవరు లోపల ఉంటారో తెలియదని వెల్లడించారు. తెలంగాణలో పనికిరాని మంత్రులు ఉన్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news