ఖమ్మం రూరల్ సీఐపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఖమ్మం రూరల్ సిఐ కి సిగ్గు ఎగ్గూ లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హత్యలు చెపిస్తావా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయ్ అని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తకు చిన్న నలుసు పడ్డా మా తడాఖా చూపిస్తామన్నారు కూనంనేని.
నీ వెంట పడతామన్నారు. ఎంతో మంది ఐపీఎస్ లను చూసామని అన్నారు. నీ చుట్టరికం ఇక్కడ ఉంటే ఇంట్లో చూపించుకోవాలని అన్నారు. భాగం హేమంతారావు మాట్లాడుతూ.. ఖమ్మం రూరల్ సిఐ అధికారిగా వ్యవహరించాలన్నారు. ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే మీ కోటు విప్పి చేయండని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలపై మీ తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. ఎంతో మంది అధికారులను ఎర్రజెండా చూస్తూ వస్తుందని.. కమ్యూనిస్ట్ లను తెరమరుగు చేయాలంటే మీ వల్ల కాదన్నారు.