తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 22న ఖమ్మం జిల్లాలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమంతా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ప్రభావంతో నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, నిన్న హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, షేక్‌పేట్, మాసాబ్‌ట్యాంక్, మెహిదీపట్నంలో కుండపోత వర్షం కురిసింది.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.