KTR : పంట నష్ట పోయిన ముషంపల్లి గ్రామ రైతు గన్నేబోయిన మల్లయ్యకు రూ.1,00,000 చెక్కు ఇచ్చి ఆర్ధిక సహాయం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో రైతులు గన్నెబొయిన మల్లయ్య, బోర్ల రాంరెడ్డిని పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రైతుల దుస్థితికి, అవస్థలకి చిహ్నంగా నిలిచిన బోర్ల రాంరెడ్డిని, ఆయన దీన పరిస్థితిని కేసీఆర్ వందల సార్లు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ముషంపల్లికి చెందిన రాంరెడ్డి పేరు బోర్ల రాంరెడ్డిగా మారింది. గన్నెబొయిన మల్లయ్య యాదవ్, బోర్ల రాంరెడ్డి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనసున్న ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుందని తెలిపారు కేటీఆర్.