గువ్వల బాలరాజు పై దాడిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గువ్వల బాలరాజు పై దాడి జరిగినట్టు తెలుస్తోందని..దాడులు సరికావు…మొన్న ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి…ఇప్పుడు బాలరాజు పై రాళ్ళ దాడి అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలను మెప్పించాలి..అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలని చురకలు అంటించారు. అపోలో హాస్పిటల్ లో బాలరాజు ఉన్నారని.. ఇలాంటి దాడులు చేయడం సరికాదన్నారు.
అలాగే, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఎదైనా జరుగవచ్చు అంటూ తెలంగాణ మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షం లో మునుగోడు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్, బిజెపి కొత్త కుట్రలను తెరలేపాయి. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కుట్రపన్నారు. 15 రోజులపాటు ఇలాగే చేస్తూ మన ఆలోచనలు మారేలా చేస్తారన్నారు తెలంగాణ మంత్రి KTR.