తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఎదైనా జరుగవచ్చు అంటూ తెలంగాణ మంత్రి KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సమక్షంలో మునుగోడు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్, బిజెపి కొత్త కుట్రలను తెరలేపాయి. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కుట్రపన్నారు. 15 రోజులపాటు ఇలాగే చేస్తూ మన ఆలోచనలు మారేలా చేస్తారు.
ఢిల్లీ పెద్దలు సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని హైదరాబాదులో పాల్వాయి స్రవంతి బిఆర్ఎస్ లో చేరిక సందర్భంగా వ్యాఖ్యానించారు. మునుగోడు విచిత్రమైన పరిస్థితి చూసామన్నారు. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ ఎందుకు ఉప ఎన్నిక తెచ్చాడు అనేది ఆయనకే తెలవాలని చురకలు అంటించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేరిన కాంగ్రెస్ పార్టీ కైనా తెలియాలని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. పాల్వాయి గోవర్థన్ రెడ్డి అప్పట్లో ఏ పార్టీలోకి వెళ్ళను అని తేల్చి చెప్పారని పేర్కొన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినప్పడు కాంగ్రెస్ నుంచి పోతున్నారు…వస్తున్నారని మండిపడ్డారు.