KTR Key Meeting With Serilingampally BRS Leaders: త్వరలో శేరిలింగంపల్లి లో ఉప ఎన్నిక వస్తుందని సంచలన ప్రకటన చేశారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ శేరిలింగంపల్లి లో బీఆర్‌ఎస్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో శేరిలింగంపల్లి లో ఉప ఎన్నిక వస్తుందని హెచ్చరించారు.

మంత్రి శ్రీధర్ బాబు తెలివిగా మాట్లాడు తున్నాడన్నారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇద్దరు brs ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు అని శ్రీధర్ బాబు అంటున్నాడని తెలిపారు. మా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పడం చూడలేదా అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యే ల పని జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందని తెలిపారు. పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.