హిమాచల్​లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు.. స్పందించిన కేటీఆర్

-

భారీ వర్షాలతో హిమాచల్ ​ప్రదేశ్​ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఆ రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. ఎటు చూసిన నదులను తలపిస్తున్న రహదారులు.. జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు.. విరిగిపడుతున్న కొండచరియలు.. ఇలా ఆ రాష్ట్రంలో విలయం తాండవిస్తోంది.

పర్యాటక ప్రాంతమైన మనాలి-చంఢీగఢ్​ జాతీయ రహదారిపై చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో అధికారులు ఆ మార్గాన్ని మూసివేశారు. ఫలితంగా మనాలి అందాలను చూడటానికి వెళ్లిన పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. అయితే.. కులు మనాలిలో చిక్కుకున్న వారిలో కొంతమంది తెలుగు విద్యార్థులు ఉన్నట్టు తనకు సమాచారం అందిందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. విద్యార్థులకు సాయం చేయాలని దిల్లీలోని రెసిడెంట్‌ కమిషనర్‌ను అప్రమత్తం చేసినట్టు ఆయన వివరించారు. వరదల్లో చిక్కుకున్న విద్యార్థుల విషయంలో సహాయం కావాల్సిన వారు బంజారాహిల్స్‌లోని బీఆర్​ఎస్​ కార్యాలయంలో కానీ.. తన కార్యాలయంలో కానీ సంప్రదించాలని కేటీఆర్‌ సూచించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news