రేవంత్‌కు రివర్స్..ఇరుక్కుపోయారుగా..వదిలేలా లేరు.!

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనవసరమైన వ్యాఖ్యలతో ఇరుక్కుపోయారు. అసలే రేవంత్ రెడ్డిని ఎక్కడ వెనక్కి లాగుదామని కాంగ్రెస్ సీనియర్లు చూస్తున్నారు. అటు అధికార బి‌ఆర్‌ఎస్ సైతం ఛాన్స్ దొరికితే చాలు రేవంత్‌ని టార్గెట్ చేయడానికి చూస్తుంది. ఇలాంటి తరుణంలో రేవంత్ రెండు రకాలుగా ఇరుక్కుపోయారు. ఇప్పుడుప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. వలసలు కొనసాగుతున్నాయి . ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అనుకునే లోపు..అమెరికాలో రేవంత్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

తానా సభలకు అమెరికా వెళ్ళిన రేవంత్…అక్కడ ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నారైలు..రేవంత్ కు కొన్ని ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో సీతక్కని డిప్యూటీ సి‌ఎం చేస్తారా? అని అడగ్గా..తప్పకుండా ఛాన్స్ ఉంటుందని , అసలు సీతక్కని సి‌ఎం చేస్తామని అన్నట్లు మాట్లాడారు. అలాగే కే‌సి‌ఆర్..రైతులకు నిరంతరాయంగా ఉచిత కరెంట్ ఇస్తున్నారు కదా..మీరు వస్తే కొనసాగిస్తారా? అని అడిగితే..రేవంత్ దానికి సమాధానంగా తెలంగాణలో 3 ఎకరాల లోపు సన్నకారు రైతులే ఎక్కువ ఉంటారని, 3 ఎకరాలకు నీళ్ళు కావాలంటే 3 గంటలు సరిపోతాయని..మొత్తం మీద రోజుకి 8 గంటల చాలని, 24 గంటల కరెంట్ అనవసరమని అన్నారు. దీనిపై ఇప్పుడు కే‌టి‌ఆర్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ రైతులకు ద్రోహం చేసే పార్టీ అని, రేవంత్ వ్యాఖ్యలకు నిరసన తెలియజేయాలని బి‌ఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ..ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదని..24 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే అన్నారు. ఇక సీతక్క సి‌ఎం అవ్వడం అనేది కామెడీ అని, అదే గిరిజనుల్లో పోడెం వీరయ్య ఉన్నారని, అటు దళితుల్లో భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ ఉన్నారని వారికి సి‌ఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు.

ఇక  కాంగ్రెస్ ఎన్నారైల్లో పదవులు టి‌డి‌పి నుంచి వచ్చిన వారికే ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జై బాలయ్య, జై రేవంత్ అంటేనే పదవులు ఇస్తున్నారని అంటున్నారు. మొత్తానికి రేవంత్ టోటల్ గా కార్నర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news