వ్యవసాయం దండుగ అన్న చోటే పండుగైంది : కేటీఆర్

-

తెలంగాణ వ్యవసాయ రంగం తొమ్మిదేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆనాడు తెలంగాణ వ్యవసాయం దండుగ అన్న చోటే ఇవాళ పండుగైందని… నెర్రెలు బారిన ఈ నేల దశాబ్ది లోపే రెండు కోట్ల ఎకరాల పచ్చని మాగాణిగా మారిందని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రగతిని వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

కరువునేలగా అల్లాడిన తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వపెట్టే అన్నపూర్ణగా మారిందని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నకు అందిస్తున్న వరాల వల్లే ఈ అద్భుతం ఆవిష్కృతం అయ్యిందని వివరించారు. రైతు బంధుతో పంట పెట్టుబడి, రైతు బీమాతో ధీమా, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు వేదికలతో భరోసా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, ప్రాజెక్టుల పూర్తితో పుష్కలంగా సాగు నీరు, పండించిన ధాన్యమంతా కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అనుబంధ రంగాలకు ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఐదు విప్లవాలు కొనసాగున్నాయని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news