తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ? అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పై కేటీఆర్ సీరియస్ అయ్యారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేకుండా రాజముద్ర కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వదిలినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ అంశంపై కేటీఆర్ స్పందించారు. ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా? అసలు ఎం జరుగుతోందో కనీసం మీకైనా తెలుసా Telangana CS గారు? అంటూ నిలదీశారు కేటీఆర్.
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ లతో ఈ వెకిలి పనులు ఏంటి ? అని నిప్పులు చెరిగారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? అని నిలదీశారు. ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కుని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు కేటీఆర్.