ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న మోదీ.. ఎప్పుడంటే?

-

ఐక్యరాజ్య సమితి 79వ సర్వసభ్య ప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశాలకు ప్రధాని మోదీ  హాజరు కానున్నట్లు తెలిసింది. ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబరు 26వ తేదీన మోదీ ప్రసంగించనున్నట్లు సమాచారం.  ఈ మేరకు యూఎన్ విడుదల చేసిన ప్రొవిజినల్‌ జాబితాలో భారత ప్రధాని పేరు కూడా ఉంది.

సెప్టెంబరు 24 నుంచి 30వ తేదీ వరకు ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్‌ దేశాధినేత ప్రసంగంతో సమావేశాలు మొదలవనుండగా.. ఆ తరువాత అమెరికా అధినేత మాట్లాడుతారు. సెప్టెంబరు 26వ తేదీ మధ్యాహ్నం భారత దేశాధినేత ప్రసంగం ఉంటుందని ఐరాస విడుదల చేసిన జాబితాలో పేర్కొంది. అయితే, ఇది తుది జాబితా కాదు. సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు, షెడ్యూల్‌లో ఏమైనా మార్పులుంటే వాటిని సవరించి రానున్న వారాల్లో తుది జాబితాను విడుదల చేస్తారు. ఇటీవలే భారత దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ.. ఈసారి ఐక్యరాజ్య సమితి భేటీకి హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news