తెలంగాణలో 1,33,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం: కేటీఆర్

-

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి విద్య, ఉద్యోగావకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి కేటీఆర్ KTR అన్నారు. సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, అమలులోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

కేటీఆర్ /KTR
కేటీఆర్ /KTR

ఈ నూతన జోనల్ వ్యవస్థతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయడంతో పాటు, ఆయా జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించడం వల్ల రాష్ట్రంలోని అన్ని స్థాయిల ఉద్యోగాల్లో స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం హామీకి మించి వివిధ శాఖల ద్వారా 1,33,000 పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకి అందించామని కేటీఆర్ అన్నారు.కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీఎస్- ఐపాస్ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రంలోకి ఆకర్శించగలిగామని… తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు దక్కేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలలో ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా మరో విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ గుర్తు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news