తెలంగాణలో “స్కాంగ్రెస్” ను ప్రజలు తిరస్కరించండని మంత్రి KTR పిలుపునిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్కు నిధులు సమకూర్చేందుకు బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకి ₹500 చొప్పున “రాజకీయ ఎన్నికల పన్ను” విధించడం ప్రారంభించిందని ఎద్దేవా చేశారు.
పాత అలవాట్లు అంత త్వరగా పోవు…అందుకే కాంగ్రెస్ పార్టీకి “స్కామ్గ్రెస్” అని పేరు పెట్టారని చురకలు అంటించారు కేటీఆర్. ఎంత డబ్బు ముట్టజెప్పినా తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని…. TSలో SCAMGRESS ను ప్రజలు తిరస్కరించండన్నారు మంత్రి KTR.
అటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇచ్చిన మాట తప్పి మళ్లీ ఎలా వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఓట్ల వేటకు తెలంగాణ బయలుదేరిన ప్రధాని మోదీ.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. అదే విధంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 575 టీఎంసీలుగా కేటాయించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.