శునకాన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టినా బుద్ది మారదంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మంచి ముహూర్తం చూసి శునకాన్ని సీట్లో కూర్చోబెట్టినా బుద్ది మారదని..నేను రేవంత్ గురించి అనవసరంగా మాట్లాడి, నోరు పాడు చేయదల్చుకొలేదని ఫైర్ అయ్యారు. అంత అసహనం ఎందుకు అంటూ రేవంత్ పై ఆగ్రహించారు. మమ్మల్ని అంటున్నారు.
అసలు మేము అధికారం లో ఉండి..వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్లు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయంతోనే బీజేపీ, కాంగ్రెస్ బండారం బయట పడిందని చురకలు అంటించారు. అటు కేటీఆర్ చేసిన తాజా ట్వీట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు అన్న క్యాప్షన్ తో ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి….’ పద్యాన్ని ఆయన షేర్ చేశారు. దీంతో కేటీఆర్ ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఆ ట్వీట్ చేశారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.