తెలుగు పద్యంతో రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే.. కేటీఆర్ చేసిన తాజా ట్వీట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు అన్న క్యాప్షన్ తో ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి….’ పద్యాన్ని ఆయన షేర్ చేశారు.
దీంతో కేటీఆర్ ఎవరిని లక్ష్యంగా చేసుకొని ఆ ట్వీట్ చేశారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. అంతకు ముందు మోసం కాంగ్రెస్ నైజం అని ,నయవంచనకు నిలువెత్తు రూపం.. కాంగ్రెస్ అని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆరోపించారు కేటీఆర్. అందుకే ఇండియా కూటమి నుండి టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు బయటకు వచ్చాయి అని అన్నారు.
మిత్రపక్షాలను ఒప్పించలేని వారు ,దేశ ప్రజలను ఏం మెప్పిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని ఎద్దేవ చేశారు. ఇండియా కూటమికి అంతకన్నా లేదని ఆయన పేర్కొన్నారు. ఇక దేశప్రజలు ప్రాంతీయ పార్టీల నాయకుల వైపే మొగ్గు చూపుతున్నారు అని ఆయన అన్నారు.
https://x.com/KTRBRS/status/1750714407997300991?s=20