KTR Tweet : కేంద్రంపై ట్విటర్​లో మరోసారి కేటీఆర్ ఫైర్

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఎవరు ట్వీట్ చేసినా వెంటనే స్పందించి సత్వరం వాళ్లకు సాయం అందేలా చూస్తారు. అదే విధంగా ట్విటర్ వేదికగా కేంద్రం, మోదీ, రాష్ట్ర బీజేపీపై తరచూ విమర్శణాస్త్రాలు సంధిస్తూ ఉంటారు.

తాజాగా కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్​ను విమర్శిస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..?

పీఎం కేర్స్ ఫండ్‌ని పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌గా పేర్కొంటూ కేంద్రం దిల్లీ హైకోర్టుకు ఇచ్చిన సమాచారాన్ని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. పీఎం కేర్స్ ఫండ్ భారత రాజ్యాంగం, పార్లమెంట్, ఏదైనా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ద్వారా సృష్టించలేదని కేంద్రం దిల్లీ కోర్టుకు తెలిపింది. దీనిపై ట్విటర్ వేదికగా స్ఫందించిన కేటీఆర్.. ప్రభుత్వ చిహ్నం, వెబ్‌సైట్‌ని వినియోగిస్తూనే… పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదు అనడాన్ని తప్పుబట్టారు. ఎన్‌పీఏ సర్కారు… ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందనటానికి ఇది ఓ క్లాసిక్ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news