కికోతో ఫోటో దిగిన కేటీఆర్.. ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్

మంత్రి కేటీఆర్ పెట్టుబడుల అన్వేషణలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కు అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. దాదాపు 10 రోజుల పాటు అమెరికాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా కు వెళ్తున్నారు. ఈ నెల 29 వ‌ర‌కు సాగే అమెరికా పర్య‌ట‌న‌లో ముఖ్యంగా తూర్పు, ప‌శ్చిమ కోస్తా ప్రాంతాల్లో కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. అమెరికాలో పలు కంపెనీల సీఈఓలతో భేటీ అవుతున్నారు.

మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేటీఆర్‌కు ఓ చిన్నారి స్వాగ‌తం ప‌లికింది. ఆ చిన్నారిని చూసి కేటీఆర్ సంబుర‌ప‌డ్డారు. ఆమె పేరు విన‌గానే మ‌రింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆ చిన్నారి పేరు ఏంటంటే.. కికో.  కికో అన‌గా క‌రుణ‌మూర్తి. ఆ అమ్మాయి పేరు విన్న కేటీఆర్ ఆమె త‌ల్లిదండ్రుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆమె త‌ల్లిదండ్రులు మంచి ఆలోచ‌నాప‌రులంటూ చెప్ప‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌శంసించారు. చిన్నారి త‌న పేరుకు త‌గ్గ‌ట్టుగానే త‌న‌తో ఫోటో దిగింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.