తెలుగు రాష్ట్రాల ప్రజలు, విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఇవాళ ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో నూతన ఏడాదికి ఘన స్వాగతం పలికారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కూడా తమ కుటుంబంతో ఉగాది పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు.
As forwarded 👇😁
ఆదాయం: అదానీకి!
వ్యయం: జనానికి, బ్యాంకులకు!అవమానం: నెహ్రూకి!
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!బస్, బభ్రాజీమానం భజగోవిందం!
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!— KTR (@KTRBRS) March 22, 2023
రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఉగాది పంచాంగం కూడా చెప్పారు. ‘‘ఆదాయం: అదానీకి, వ్యయం: జనానికి, బ్యాంకులకు. అవమానం: నెహ్రూకి, రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి. బస్, బభ్రాజీమానం భజగోవిందం! దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
As forwarded 👇
ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం : తెలంగాణ రాష్ట్రానికిఅవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి…పతనం ఇగ షురువాయే.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 22, 2023
దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు. ‘‘ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి. వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి. అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు. రాజ పూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు. తుస్.. పిట్టల దొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయితీ లెక్క తేలుడే తరువాయి. పతనం ఇక షురువాయే!!’’ అని ట్వీట్ చేశారు.