ఇవాళ వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌

-

రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో నేరుగా జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాల్లో నిర్మించిన  కాకతీయ మెగా జౌళి పార్క్‌కు వెళ్లనున్నారు. అక్కడ దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీకి శంకుస్ధాపన చేయనున్నారు. దేశంలోనే అతిపెద్దదిగా ఖ్యాతిగాంచిన ఈ పార్క్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో అక్టోబర్‌లో 1203 ఎకరాల్లో ప్రారంభించారు. రూ.567 కోట్లకుపైగా వెచ్చించి TSIIC పార్క్‌లో అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చింది. కరోనా మహమ్మారి కారణంగా తొలుత పనులు మందగించినా….ఆ తరువాత వేగం పుంజుకున్నాయి.

తాజాగా దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ పరిశ్రమ 8 ఫ్యాక్టరీలను నిర్మించడానికి సన్నద్ధమైంది. మొత్తం 900 కోట్ల వ్యయంతో 261 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ పూర్తైతే… ప్రత్యక్షంగా పరోక్షంగా  30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. యంగ్ వన్‌కు శంకుస్థాపన నేపథ్యంలో మంత్రి ట్వీట్ చేశారు. వరంగల్‌లో దేశంలోనే పెద్దదైన టెక్స్‌టైల్ పార్క్… కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ బాగా రూపు దిద్దుకుంటోందని మంత్రి అన్నారు. 900 కోట్ల పెట్టుబడితో కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి  తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news