రెండురోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం రోజున ముర్ముకు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వాగతం పలికారు. మంత్రులు సత్యవతి రాఠోడ్, మహమూద్ అలీ, సబితారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు సంతోష్‌కుమార్, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై దాదాపు 6 నెలల తర్వాత కలిశారు. చివరిసారిగా వారు గత ఏడాది డిసెంబరు 28న రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఇద్దరూ కలిశారు. ఆ తర్వాత వారిద్దరూ పలకరించుకోవడం ఇదే ప్రథమం.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు హాజరవనున్నారు. ఈ పరేడ్‌లో గ్రాడ్యుయేట్ అయిన వారి నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.